Hairs In Ear : చెవి వెంట్రుకల బట్టి ఇట్టే వ్యక్తిత్వం చెప్పేయచ్చు

ఈ ప్రపంచంలో ఉన్న అందరి మనుషుల మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఒక్కోరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని సంకేతాలను బట్టి ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో గుర్తి్స్తారు.


రంగులు, చేతులు, కాళ్లు బట్టి కొందరు వ్యక్తిత్వం చెబుతుంటారు. ఉదాహరణకు పుట్టుమచ్చలు ఒక్కో స్థానంలో ఉంటే అదృష్టం వస్తుందని అంటుుంటారు. అయితే ఇలాగే చెవి విషయంలో కూడా అదృష్టం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొందరికి శరీరంపై వెంట్రుకలు ఉంటాయి. కొందరికి చేతులు, కాళ్లలో ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. మరికొందరికి చెవుల దగ్గర ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. ఇలా చెవిలో బయట, లోపలు వెంట్రుకలు ఉంటే వారి మనస్తత్వాన్ని చెప్పేయచ్చని పండితులు అంటున్నారు. అయితే చెవిలో ఎక్కడెక్కడా వెంట్రుకలు ఉంటే.. వారి మనస్తత్వం ఎల ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం.

చెవి లోపల వెంట్రుకలు ఉంటే?
కొందరికి చెవికి పైన కాకుండా లోపల ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. అయితే ఇలా ఎవరికైతే చెవి లోపల ఎక్కువ జుట్టు ఉంటుందో వారు అదృష్ట వంతులు అని పండితులు చెబుతున్నారు. జుట్టు ఎవరికైతే చెవిలో ఎక్కువగా ఉంటుందో వారు చాలా తెలివైనవారట. జీవితంలో వీరికి అసలు డబ్బుకి లోటు ఉండదు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా ఉంటారు. వీరికి అదృష్టం కూడా ఎల్లప్పుడూ వారితోనే ఉంటుంది. వీరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

చెవి వెలుపల వెంట్రుకలు ఉంటే?
చెవి వెలుపల కొందరికి బాగా ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. అయితే ఇలా ఉన్నవారు కళలలో బాగా ప్రావీణ్యం పొందుతారట. వీరిని ఎవరైనా ఆకర్షిస్తుంటారు. వీరు అందరితో సరదాగా ఉంటారు. అందరిలో వీరు స్పెషల్‌గా ఉంటారు. అందరితో సరదాగా కలిసిపోతుంటారు. వీరికి సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

చెవులపై చిన్న వెంట్రుకలు ఉంటే?
కొందరికి చెవులపై వెంట్రుకలు చిన్నగా, చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఉన్నవారు జీవితంలో ఎక్కువగా సమస్యల బారిన పడతారట. ఏ పని కూడా సరిగ్గా కాదు. చేపట్టిన పనులు అన్నింటికి కూడా ఆటంకాలే ఎదురు అవుతాయి. ఎంత కష్టపడినా కూడా వీరికి విజయం లభించదు. ఎంతో పట్టుదలతో పనిచేయాలి. అప్పుడే అనుకున్న పనులు అన్ని కూడా అువతాయి. వీరు ఆర్థికంగా కూడా సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువగా డబ్బు సమస్యలు ఉంటాయి.

చెవులపై పొడవుగా జుట్టు ఉంటే?
కొందరికి చెవులపై పొడవు జుట్టు ఉంటుంది. ఇలాంటి వారు సమాజంలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాగే అందరితో కూడా మంచి రిలేషన్‌ ఉంటుంది. వీరు ఎవరికైనా కూడా సాయం చేస్తుంటారు. వీరికి దేవుని మీద భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై దయ ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మంచిగా ఆలోచిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా వీరికి ఉండవు. సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.