Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ఐదో టీ20 మ్యాచ్‌లో అందుకున్న పలు రికార్డులు

టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.


ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు శుభ్‌మన్ గిల్‌ రికార్డును బ్రేక్ చేశాడు. 2023లో న్యూజిలాండ్ పై గిల్‌ 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో రుతురాజ్ గైక్వాడ్‌, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
అభిషేక్ శర్మ – 135 పరుగులు – ఇంగ్లాండ్ పై (2025లో)
శుభ్‌మన్ గిల్ – 126 నాటౌట్‌ – న్యూజిలాండ్ పై (2023)
రుతురాజ్ గైక్వాడ్ – 123 నాటౌట్ – ఆస్ట్రేలియా పై (2023)
విరాట్ కోహ్లీ – 122 నాటౌట్ – అఫ్గానిస్థాన్ పై (2022)
రోహిత్ శర్మ – 121 నాటౌట్ – అఫ్గానిస్థాన్ పై (2024)

అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా..

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 13 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. 2017లో శ్రీలంక పై రోహిత్ శర్మ ఓ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు బాదాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో సంజూ శాంసన్‌, తిలక్ వర్మలు ఉన్నారు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
అభిషేక్ శర్మ – 13 సిక్సర్లు – ఇంగ్లాండ్ పై (2025లో)
రోహిత్ శర్మ – 10 సిక్సర్లు – శ్రీలంక పై (2017లో)
సంజూ శాంసన్ – 10 సిక్సర్లు – దక్షిణాఫ్రికా పై (2024లో)
తిలక్ శర్మ – 10 సిక్సర్లు – దక్షిణాఫ్రికా పై (2024లో)

రెండో ఫాస్టెస్ట్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో 35 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ తొలి స్థానంలో నిలిచాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ – 35 బంతుల్లో – శ్రీలంక పై (2017)
అబిషేక్ శర్మ – 37 బంతుల్లో ఇంగ్లాండ్ పై (2025)
సంజూ శాంసన్ – 40 బంతుల్లో – బంగ్లాదేశ్ పై (2024)

ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌, టీమ్ఇండియా ఆటగాడు రోహిత్ శర్మలు ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 35 బంతుల్లో – బంగ్లాదేశ్ పై (2017)
రోహిత్ శర్మ (భారత్) – 35 బంతుల్లో- శ్రీలంక పై (2017)
అబిషేక్ శర్మ (భారత్‌) – 37 బంతుల్లో – ఇంగ్లాండ్ పై (2025)
జాన్సన్ చార్లెస్ (వెస్టీండీస్‌) – 39 బంతుల్లో- దక్షిణాఫికా పై (2023)
సంజూ శాంసన్ (భారత్‌) – 40 బంతుల్లో- బంగ్లాదేశ్ పై (2024)