Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 12 వేలకే లభిస్తున్న43 inch Smart Tv.

Flipkart Sale నుంచి ఈరోజు భారీ Smart Tv ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ నుంచి ఈరోజు ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు బ్రాండ్ న్యూ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ 12 వేల రూపాయల కంటే తక్కువ ధరకు లభిస్తుంది.


Flipkart Sale 43 ఇంచ్ Smart Tv ఆఫర్
Coocaa బ్రాండ్ యొక్క 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 56% డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. వీ స్మార్ట్ టీవీ పై మరొక అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని 12 వేల రూపాయల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చు.

Coocaa (43) FHD Smart Tv: ఫీచర్స్
ఈ కూకా స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Colita OS పై పని చేస్తుంది. ఈ టీవీ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు Eye Care టెక్నలాజి కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజి కలిగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అయితే, ఈ టీవీలో Netflix మరియు Disney+ Hotstar యాప్స్ కి సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చూడవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.