Posani Krishna Murali : సంచలన తీర్పు ఇచ్చిన కడప కోర్టు..పోలీసులకు ఊహించని షాక్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) ని ఇటీవలే పోలీసులు హైదరాబాద్ లోని తన నివాసం లో అరెస్ట్ చేసి, రైల్వే కోడూరు కోర్టులో హాజరు పర్చగా, ఆయనకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత ఆయనకు అనేక ప్రాంతాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, కేసులు నమోదు అవ్వడంతో పోలీసులు ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నారు. కాగా, పోసాని కృష్ణ మురళి కడప మొబైల్ కోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు మంజూరు చేసింది. అంతే కాకుండా పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీ విచారణని కోర్టుని కోరుతూ పిటీషన్ వేయగా, కోర్టు అందుకు అంగీకరించలేదు. అనుచిత వ్యాఖ్యల విషయం లో కస్టడీ లోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పుకొచ్చింది.

దీంతో పోసాని కి భారీ ఊరట లభించింది. కానీ మిగిలిన కేసుల్లో ఆయనకు ఇంకా రిమాండ్ కొనసాగుతుంది. టీడీపీ, జనసేన అభిమానులు పోసాని పై పోక్సో కేసు వేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కూతుర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆయన తల్లి పై కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేసాడు. దీంతో పోసానిని రిమాండ్స్ ద్వారానే ఆరు నెలలు వివిధ పోలీస్ స్టేషన్స్ కి తిప్పాలని కసితో ఉంది కూటమి ప్రభుత్వం. కానీ అనుచిత వ్యాఖ్యలపై ఎక్కువ రోజులు జైలులో ఉండడం అసాధ్యం. కాబట్టి పోసాని ఈ నెలలోనే విడుదలై బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. పోసాని తరుపున న్యాయవాది కూడా చాలా బలంగా పోరాడుతున్నాడు. చూడాలి మరి పోసాని పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. పోసాని ని అరెస్ట్ చేసే సమయంలోనే ఆయన అస్వస్థతతో ఉన్నాడు.

అలాంటి సమయంలో కూడా అతన్ని ఇంతలా బాధపెట్టడం సరికాదని సోషల్ మీడియా లో వైసీపీ అభిమానులు అంటున్నారు. కూటమి నాయకులూ ఇప్పటి వరకు బూతులు మాట్లాడలేదా?, స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పులు చూపిస్తూ వైసీపీ నాయకులను దూషించలేదా?, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ని అనరాని మాటలు అనలేదా?, వాలంటీర్స్ పై లేనిపోనీ నిందలు వేయడలేదా?, లోకేష్ , చంద్రబాబు వంటి వారు కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసారు, వీళ్లపై కూడా కేసులు వేయొచ్చు కదా?, అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షానికి మరో రూలా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.