మీకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే, మీరు చనిపోయేలోపు కోటీశ్వరులవుతారు.. మీకు కూడా ఉందా?

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం మాదిరిగానే పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంది. దీని ప్రకారం మనిషి శరీరంపై ఉండే పుట్టుమచ్చలు ఏ విధంగా సంకేతాలను చూపిస్తాయి.


అలాగే మన జీవితం ఎలా ఉంటుంది అనేది సూచిస్తుంటుంది. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం, శరీరంలో పుట్టుమచ్చలు ఉంటే వాటి ద్వారా ఆ వ్యక్తి జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అంచనా వేయవచ్చు. సాముద్రిక శాస్త్రం ఈ పుట్టుమచ్చలను పరిశీలించి, వాటి ఆధారంగా వ్యక్తిత్వం, భవిష్యత్తు, ఆర్థిక స్థితి గురించి సమాచారాన్ని అందిస్తుంది. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉన్నవారు అదృష్టం, సంపద, ఆరోగ్యం వంటి అంశాలను పొందుతారని చెబుతారు. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు చచ్చేలోపల కచ్చితంగా కోటీశ్వరులు అవుతారని చెబుతుంటారు. ఇంతకీ ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే కోటీశ్వరులు అవుతారనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. నుదుటి కుడివైపున పుట్టుమచ్చ:

సాముద్రిక శాస్త్రం ప్రకారం, నుదుటి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నవారు తెలివిగల వ్యక్తులు. వీరు డబ్బు సంపాదనలో చాలా నిష్ణాతులు. వీరికి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఎలాంటి పనులు చేయాలి?, ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరు నీళ్లు తాగినంత సులభంగా డబ్బులు సంపాదించగలుగుతారు. వారికి ఎప్పటికీ ఆర్థిక కష్టాలు ఉండవు. కానీ, ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీరు అంతా విలాసవంతంగా జీవించేందుకు ఆసక్తి చూపుతారు.

2. నాభి దగ్గర పుట్టుమచ్చ:

పొట్టలోని నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్నవారు చిన్న వయసులోనే సంపద సంపాదిస్తారు. వీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయరు. డబ్బు సంపాదించడం తేలికగా చేసేస్తారు. సులభంగా డబ్బులు సంపాదించగలరు. అలాగే ఆ డబ్బులను చాలా సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. వారికి సంపత్తి, కీర్తి, గౌరవం చేకూరుతుంది. మరి ముఖ్యంగా, పేద కుటుంబంలో పుట్టినా, వారు విలాసవంతమైన జీవితాన్ని గడిపి, విజయం సాధిస్తారు.

3. ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ:

ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. వీరికి అదృష్ట దేవతతో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. తద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తారు. వీరికి సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. వారి జీవితం చాలా సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ వ్యక్తులు ఎన్నో పలు పదవులను సాధిస్తారు మరియు ఎప్పటికీ డబ్బుకు కొరత పడదు.

4. ముక్కు మీద పుట్టుమచ్చ:

ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు విపరీతమైన కోపం చూపుతారు. వీరికి క్షణాల్లోనే కోపం వచ్చేస్తుంటుంది. కోపానికి ప్యాంటు షర్ట్ వేస్తే వీరే. కానీ వారు ఎంతో పేరు, ప్రఖ్యాతి సంపాదిస్తారు. తమ వ్యాపారంలో, తాము చేపట్టే పనుల్లో విజయం సాధించి భారీగా డబ్బులను సాధించగలుగుతారు. ఈ వ్యక్తులు చాలా తక్కువ సమయంలోనే విజయాన్ని సాధించి, ప్రజలలో ప్రఖ్యాతిని పొందుతారు.

5. పెదవులపై పుట్టుమచ్చ:

పెదవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు జ్ఞానవంతులు, ఎంతో తెలివిగలవారు. వీరు మంచి చదువు పొందుతారు మరియు అధ్యయనంలో మరింత ప్రగతిని సాధిస్తారు. వీరు గురువులుగా, పాఠశాలల్లో మంచి గౌరవం పొందుతారు. ఈ విధంగా, పుట్టుమచ్చలు శరీరంలో ఉన్నత స్థితి, వ్యక్తిత్వం, అదృష్టం మరియు సంపద గురించి కొన్ని సంకేతాలను ఇస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.