రక్షించేవాడు కాదు. రాక్షసుడు సోనుసూద్ 1000 కోట్ల స్కాం బయటపెట్టిన అన్వేష్

ప్రముఖ యూట్యూబ్ అన్వేష్ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన తన సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరి గుట్టు బయట పెడుతూ అధికారులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారు.


ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది యూట్యూబర్స్ సినిమా సెలబ్రిటీలు పట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

తాజాగా అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక నటుడు పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారనీ ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో రియల్ హీరోగా ఎంతో మందికి సహాయ సహకారాలు చేసిన సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఆస్తులను కూడా అమ్మేసి పేదవారికి సహాయం చేస్తూ అందరికీ అండగా నిలిచారు. కరోనా సమయంలో ఇతర దేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు రప్పించడం ఆక్సిజన్ సిలిండర్లను పంపించడం రైతులకు ట్రాక్టర్లను అందించడం ఇలా ఎన్నో రకాలుగా సహాయం అందించారు.

ఇలా రియల్ హీరోగా అందరూ ఈయనని మెచ్చుకుంటున్న తరుణంలో అన్వేష్ ఈయన రక్షించేవాడు కాదు రాక్షసుడని 1000 కోట్ల స్కాం తిమింగళం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ తన వీడియోలో సోనుసూద్ గురించి మాట్లాడుతూ…సోనూసూద్ బెట్టింగ్ సామ్రాజ్యానికే అధినేత. కరోనా టైంలో సోనూసూద్ ను కలియుగ కర్ణుడు అన్నారు. అయితే అలాంటి కర్ణుడు రాక్షసుడుగా మారి వేల కోట్లు ఎలా సంపాదించాడు. నేను ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తానని తెలిపారు.

సోను సూద్ మధ్య తరగతి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా సినిమాలలో సంపాదించింది మొత్తం సహాయం చేయడానికి ఖర్చు చేశారు.ఇక తన భార్య నిర్మాతగా మారి 50 కోట్లతో సినిమా చేయగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.కలెక్షన్స్ అంతా కలిపినా కూడా రూ. 20 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.30 కోట్ల నష్టం సంగతి ఏంటి..? ఇక ఈ రూ.50 కోట్లు ఎలా వచ్చాయంటే అది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. రూ.50 కోట్లు కాదు దాదాపు రూ.1000 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ ద్వారానే స్కామ్ చేశారు అంటూ అన్వేష్ వెల్లడించారు. అటు హర్ష సాయి ఇటు సోను సూద్ ఇద్దరు కూడా స్కాం చేసే విషయంలో అన్నదమ్ములే అంటూ సోను సూద్ గురించి అన్వేష్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.