కేవలం రూ.10 వేలతోనే రూ.37 లక్షల నగదు పంటలు పండించే HDFC పథకం..

హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పథకాలలో గడిచిన 10 ఏళ్లలో 15% నుంచి 21% వార్షిక రాబడిని అందించాయి. మీరు కేవలం 10000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత రాబడి పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


మీరు చిన్నచిన్న పొదుపు చేయడం ద్వారా చాలా ఏళ్ల తర్వాత మీరు ఒక పెద్ద నిధిని సృష్టించుకోవచ్చు. ఇది నిజంగా సాధ్యం. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈ లక్ష్యం సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో క్రమం తప్పకుండా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అలాగే కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా మీ కల నెరవేరుతుంది.

మనదేశంలో ఆస్తుల నిర్వహణ పరంగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ మూడవ అతిపెద్ద ఫండ్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంట్లో మీరు సిప్ లో 10 ఏళ్ల పెట్టుబడిపై 15 నుంచి 21 శాతం వరకు రాబడిని ఇచ్చే అనేక పథకాలు ఉన్నాయి. మీరు కేవలం నెలకు పదివేల రూపాయలు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీరు రూ.36 లక్షలకు పైగా అందుకునేవారు. ఏ పథకంలో అయినా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీ ఆలోచన మారేలా చేస్తుంది. మీరు ఈ ప్లాన్లో కేవలం 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకుంటే కాలక్రమైనా మీరు పెద్ద మొత్తంలో నిధిని సృష్టించుకోవచ్చు. మార్కెట్లో ఉన్న కదలికలని సిప్ ట్రాక్ చేయాల్సిన పని ఉండదు.

మీరు ప్రతి నెల మార్కెట్ పెరిగినా లేదా తగ్గినా కూడా ఒకే మొత్తాన్ని పెట్టుబడి కొనసాగిస్తారు. సరైన ధర దగ్గర యూనిట్లను కొనుగోలు చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఈ విధానం మీకు సరైన ఆర్థిక క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఇందులో ఉన్న మరొక రహస్యం కాంపౌండింగ్. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ ప్లాన్ కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. మీరు హెచ్డిఎఫ్సి మిడి క్యాప్ లో పదేళ్లపాటు నెలకు పదివేల రూపాయలు సిప్ చేస్తే మీరు సుమారు రూ.37 లక్షలు అందుకుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.