విద్యార్థులు లేకుండానే మధ్యాహ్న భోజనం.. స్పెషల్‌గా చికెన్,బగారా

విద్యార్థులు లేకుండానే మధ్యాహ్నం భోజనం కోసం చికెన్, బగార అన్నం వండటంతో ఉపాధ్యాయులపై సిద్ధిపేట కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.


వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించిన కలెక్టర్ కు మెనూలో లేని చికెన్,బగార అన్నం కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిల్లలు లేకుండా వంట ఎందుకు చేశారని ఉపాధ్యాలను వివరణ కోరగా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు విద్యార్థులను ఇంటికి పంపించామని చెప్పడంతో వండిన వంటను హాస్టల్ విద్యార్థులకు పంపమని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయుల పైన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక రోజు ముందు విద్యా సంస్థలు బంద్ అని తెలిపిన కూడా విద్యార్థులు లేని సమయంలో స్పెషల్ గా వంట ఎందుకు వంట చేరని ఉపాధ్యాలును నిలదీశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.