ఆ పొలిటికల్ లీడర్ ఇంటికి అల్లుడుగా సుమ కొడుకు.. దెబ్బకు లైఫ్ సెటిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర యాంకర్ గా వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ఒకానొక సమయంలో ఎంతో బిజీగా ఉన్న సుమ ఇప్పుడు మాత్రం వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతున్నారు.


ఇలా ఒకే రోజు వరుస ఈవెంట్లలో పాల్గొంటూ రెండు చేతుల సంపాదిస్తూ బిజీ యాంకర్ గా మారిపోయారు.

ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సుమా కుమారుడు రోషన్ కూడా ఇదివరకే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ సినిమా కోసం ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదని చెప్పాలి. ప్రస్తుతం రెండో సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రోషన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రోషన్ ఒకమ్మాయి ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరు పెళ్లి కూడా జరగబోతుందని సమాచారం.

ఇక రోషన్ ప్రేమించిన అమ్మాయి బడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తెలుస్తోంది. ఇలా రాజకీయ నాయకుడి కుమార్తె ప్రేమలో రోషన్ ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయం మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో అమ్మాయి తరఫు వాళ్లు కూడా సుమా కుటుంబం కావడంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారని సమాచారం. అయితే రోషన్ మాత్రం కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మళ్ళీ సుమ కొడుకు ప్రేమ గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జీవితంలో రోషన్ సెటిల్ అయినట్టే అంటూ కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.