హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది.
తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు.
విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే సమంత, నాగ చైతన్యల బంధం గురించి ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. వి నాగనాథ్ ఓ ఇంటర్వూలో సంచలన కామెంట్స్ చేశారు.
విడాకులు తర్వాత సమంత సింపతీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. సినిమా ఈవెంట్స్‌లో విడాకుల విషయంలో తన తప్పు ఏం లేదని , తాను మోసపోయినట్టు సమంత నటించిందని నాగనాథ్ తెలిపారు.దొంగ ఏడుపులు ఏడ్చి నాగచైతన్యను సమంత వదిలించుకుందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంలో నాగ చైతన్య చాలా బాధపడినట్టు సైకాలజిస్ట్ నాగనాథ్ వెల్లడించారు. సమంతతో పోలిస్తే నాగ చైతన్య 100 శాతం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో చైతన్య పెళ్లికి ఒప్పుకోకపోతే అతన్ని బెదిరించి, పెళ్లి చేసుకుని మరీ విడాకులు తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. సమంత విషయంలో సైకాలజిస్ట్ నాగనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
































