అతి చౌకైన ధరకే మోటోరోలా G45 5G ఫోన్.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ రాదు.. డోంట్ మిస్

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? దేశీయ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ అందిస్తోంది. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 17 వరకు (Motorola G45 5G) జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.


ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 10వేల కన్నా తక్కువ ధరకు మోటోరోలా 5G ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. గత ఏడాది భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఫోన్ లాంచ్ అయింది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

మోటోరోలా G45 5G డిస్కౌంట్లు :
మోటోరోలా G45 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో రూ.11,999 ధరకు లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ రూ.11,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందిస్తోంది. కనీసం రూ.3వేలతో పాత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మోటోరోలా G45 5G రూ.9వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు.

మోటోరోలా G45 5G ఫీచర్లు :
డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 6.5-అంగుళాల భారీ HD+ డిస్‌ప్లే
పర్ఫార్మెన్స్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌, 8GB ర్యామ్, 128GB స్టోరేజీ
కెమెరా : 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌, బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సిస్టమ్
సెల్ఫీలు, వీడియో కాల్స్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా
బ్యాటరీ : 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, భారీ 5000mAh బ్యాటరీ
కనెక్టివిటీ : డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ సిమ్ కార్డ్‌లు, 13 కన్నా ఎక్కువ 5G బ్యాండ్‌లకు సపోర్టు
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హలో UIపై రన్ అవుతుంది.
కలర్ ఆప్షన్లు : బ్లూ, గ్రీన్, పింక్ లావెండర్, వివా మెజెంటా అనే 4 కలర్ ఆప్షన్లు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.