రోజుకు రూ.45 కడితే.. చేతికి రూ.25లక్షలు.. ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ ఇదే..

క్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలనుకుంటున్నారా..? చిన్న మొత్తంలో పొదుపుతో రూ.25 లక్షలను పొందాలనుకునే వారికీ ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ ఆనంద్ పాలసీ బెస్ట్.


ఈ పాలసీ కేవలం బీమా రక్షణ మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద మీరు రోజుకు కేవలం రూ.45 ఆదా చేయడం ద్వారా ఏకంగా రూ.25 లక్షలు మీ చేతికి వస్తుంది. ఈ స్కీమ్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చిన్న పొదుపు – పెద్ద ప్రయోజనం

సాధారణంగా పెద్ద మొత్తంలో నిధిని జమ చేయాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం అని చాలామంది భావిస్తారు. కానీ జీవన్ ఆనంద్ పథకం ఈ ఆలోచనను మార్చేసింది. ఈ పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ. 1,358 (రోజుకు రూ. 45) పొదుపు చేస్తే 35 ఏళ్ల కాలంలో మీరు రూ.25 లక్షల నిధిని పొందవచ్చు. ఈ పథకం ద్వారా మీకు బీమా రక్షణతో పాటు, బోనస్‌ల రూపంలో అదనపు రాబడి కూడా ఉంటుంది.

రూ.25 లక్షలు ఎలా సాధ్యం?

మీరు 35 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 16,300 పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి రూ. 5,70,500 అవుతుంది. పాలసీ కాలం పూర్తయ్యాక, మీరు పెట్టిన పెట్టుబడికి అదనంగా బోనస్‌లు కలుపుకుని దాదాపు రూ. 25 లక్షల నిధిని అందుకుంటారు. ఈ మొత్తం ఎలా వస్తుందంటే:

బేసిక్ సమ్ అష్యూర్డ్: రూ. 5,00,000

రివిజనరీ బోనస్: సుమారు రూ. 8,60,000

తుది అదనపు బోనస్: సుమారు రూ. 11,50,000

ఈ మూడు మొత్తాలూ కలిపి మెచ్యూరిటీ సమయంలో మీకు సుమారు రూ. 25 లక్షలు లభిస్తాయి. ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏంటంటే..? ఇది డబుల్ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎల్‌ఐసీ ప్రతి సంవత్సరం పాలసీదారుడికి రివిజనరీ బోనస్‌ ఇస్తుంది. దీంతో పాటు, పాలసీ కనీసం 15 సంవత్సరాలు పూర్తయితే, మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తంలో తుది అదనపు బోనస్‌ను కూడా జత చేస్తుంది.

బీమా కవరేజ్ సైతం..

జీవన్ ఆనంద్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మెచ్యూరిటీ ప్రయోజనంతో పాటు బీమా కవరేజ్ కూడా పొందుతారు. దురదృష్టవశాత్తు పాలసీ కాలంలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి బీమా మొత్తంలో 125శాతం మరణ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా పాలసీకి ఆక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, టెర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ వంటి రైడర్లను కూడా జోడించుకునే అవకాశం ఉంది. ఇవి అదనపు భద్రతను కల్పిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.