యునైటెడ్ కింగ్డమ్లో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు, ప్రదర్శనలు, రాజకీయ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ముస్లిం ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా యూకే ఫస్ట్ నినాదంతో ప్రజలు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల 12 ఏళ్ల బాలిక లోలా (Lola)ను ఓ ముస్లిం ఇమ్మిగ్రెంట్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. రక్షణ కోసం ఆ పాప దాడి చేయడంతో పోలీసులు ఆ పాపపైనే కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
యూకేలో ఇమ్మిగ్రేషన్ విషయం గత కొన్ని సంవత్సరాలుగా వివాదాస్పదంగా మారుతోంది. 2024లో జరిగిన కొన్ని హత్యలు , దాడులు, ముఖ్యంగా ముస్లిం ఇమ్మిగ్రెంట్లతో ముడిపడిన సంఘటనలు, స్థానికుల్లో కోపాన్ని రేకెత్తించాయి. ఆగస్టులో జరిగిన కొన్ని దాడులు తర్వాత దేశవ్యాప్త అల్లర్లు జరిగాయి. ప్రభుత్వం ఈ అల్లర్లను “వైట్ సుప్రెమసీ”గా ముద్ర వేసి, ప్రతిఘటనకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంది. లేబర్ పార్టీ ప్రభుత్వం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఇమ్మిగ్రెంట్లను రక్షించడం, స్థానికుల ప్రదర్శనలను అణచివేయడం వంటి చర్యలు మరింత కోపాన్ని పెంచాయి.
2025 ఆగస్టు 23న 12 ఏళ్ల బాలిక లోలా , ఆమె స్నేహితులు రూబీ , మాయా పార్కులో ఆడుకుంటున్నప్పుడు ఒక అక్రమ ఇమ్మిగ్రెంట్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారు ప్రతిఘటించడంతో ఆ ముస్లిం అక్రమ ఇమ్మిగ్రెంట్ కు గాయాలయ్యాయి. పోీలసులు పన్నెండేళ్ల బాలిక లోలా దాడి చేసిందని అరెస్ట్ చేశారు. ఆమె చేతిలో ఆయుధాలు కనుగొన్నారని, అవి చట్టవిరుద్ధమని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. బాలికలు బాధితులు అయినా, ప్రభుత్వం ఇమ్మిగ్రెంట్ అలీని రక్షిస్తోందని, లోలాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.2024లో జరిగిన అల్లర్లో ఇమ్మిగ్రెంట్లతో ముడిపడిన బాలికల దాడులు వివాదం జరిగింది. చిన్న బాలిక తన రక్షణ కోసం చేసిన చర్యకు శిక్ష అనుభవిస్తోందని, తప్పు చేసిన ఇమ్మిగ్రెంటను రక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం “డైవర్సిటీ”ని ప్రోత్సహిస్తోందని చెబుతోంది. ముస్లిం ఇమ్మిగ్రెంట్ల అంశంపై మొదటి నుంచి యూకే ప్రజల్లో ఆగ్రహం ఉంది. అది ఇప్పుడు రోడ్లపైకి రావడానికి కారణం అవుతోంది.
































