పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
నారింజ పండులో ఫైబర్ 3 గ్రాములు, ప్రోటీన్ 1 గ్రాము, కార్బోహైడ్రేట్ 15 గ్రాములు, విటమిన్ ఎ 14 మైక్రోగ్రాములు, విటమిన్ సి సుమారు 70 మి.గ్రా, పొటాషియం 237 మి.గ్రా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో, బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా.. నారింజ రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఎక్కువగా నారింజ పండును తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రసంతో పోలిస్తే దాని పండ్లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మరోవైపు నారింజ రసాన్ని తాగితే.. అందులో చక్కెర శాతం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతుంది. మరోవైపు.. నారింజ తొక్కల నుండి హెర్బల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
ఇదిలా ఉంటే.. నారింజపండును ఒక రోజులో ఎన్ని తినాలో కూడా గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడానికి నారింజను తీసుకోవడం అంటే ఎక్కువగా తింటే తొందరగా తగ్గుతారని కాదు.. రోజుకు కేవలం ఒక నారింజ పండును మాత్రమే తీసుకోవాలి. దాని వల్ల మీకు మేలు చేకూరుతుంది. ఎక్కువగా తినడం వలన జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి.