విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

విద్యాశాఖ మంత్రిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. కోమటిరెడ్డి రాజన్న టీం పేరుతో సోషల్ మీడియాలో హనబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేమ్ బోర్డుతో రాజగోపాల్ రెడ్డి కుర్చీలో కూర్చున్న ఫోటోతో ఆయన వెనుక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజముద్రతో విస్తృతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


మరికొన్ని రోజుల్లోనే ఆయన విద్యాశాఖ మంత్రిగా కాబోతున్నారని తెలియజేస్తున్నామంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై తీవ్ర చర్చ సాగుతుంది. స్వయంగా రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవిపై ఎన్నోసార్లు పలు కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేశారు. తాజాగా ఇవాళ ఏకంగా మంత్రి పదవియే కాకుండా శాఖను కూడా కేటాయిస్తూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవడంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.