రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?

రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ.. రూ.5.48 ఖర్చుపెట్టండి. అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చు.


ఈ పాలసీ పొందడానికి ఖాతాదారుడు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.

మీరు ఏడాదికి రెండు వేలు చెల్లిస్తే, రూ. 40 లక్షలు, ఏడాదికి వెయ్యి చెల్లిస్తే రూ. 20 లక్షలు, లేదూ.. ఏడాదికి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ అనుబంధ సంస్థ అయిన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తమ ఖాతాదారులకు సమగ్రమైన, చౌకైన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇది అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఎంతో ఊరటనిస్తుంది.

రోడ్డు, విద్యుత్తు ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు.. యాక్సిడెంట్స్, పాముకాటు వంటి కారణాలతో మరణించినా బాధితుడు సూచించిన నామినీకి రూ.40 లక్షలు, ఎస్‌బీఐ అందిస్తుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారికి అర్హత ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. హెల్త్ పరంగానే కాదు, ఇతర రంగాలకు కూడా తక్కువ ప్రీమియంతో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.