టాలీవుడ్ ఇండస్ట్రీలో సీఎం అయ్యే యోగం ఉన్న ఏకైక మొనగాడు ఆ హీరోనే

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది రాజకీయాల్లోకి వెళ్తారు. అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు తెరపై బొమ్మలే రాజ్యమేలుతాయి అన్నట్లు ఎంతో మంది సినీ నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు.


అలాంటి వారిలో ఏంజిఆర్, జయలలిత, సీనియర్ ఎన్టీఆర్,రోజా,బాలకృష్ణ, పవన్ కళ్యాణ్,విజయశాంతి,కంగనా రనౌత్ వంటి కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు.

వీళ్లే కాకుండా ఎంతోమంది, బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్, మాలీవుడ్ ఇలా చాలా ఇండస్ట్రీల నుండి హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రాజకీయాల్లో రాణించారు.అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్,బాలకృష్ణ, రోజా, చిరంజీవి వంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగారు.అయితే ఇంతమంది సినిమాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ తప్ప మిగిలిన ఎవరూ కూడా సీఎం కాలేకపోయారు.కానీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మన టాలీవుడ్ లో ఉన్న హీరోలలో సీఎం అయ్యే ఏకైక వ్యక్తి ఆయనే అంటూ గతంలో నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. (Tollywood)

అయితే సీఎం అయ్యో యోగం ఉన్న ఆ టాలీవుడ్ హీరో అంటే చాలామంది పవన్ కళ్యాణ్ అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కాదు.సీఎం అయ్యే యోగం ఉన్న ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.. అయితే నిర్మాత చంటి అడ్డాల గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో సినిమా చేద్దామనుకున్నప్పుడు ఆయన జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపించాను. ఎన్టీఆర్ జాతకం చూసి ఈయనతో సినిమా చేయండి. నష్టాలు రావు.అలాగే ఈయన జాతకం ప్రకారం చూసుకుంటే కచ్చితంగా సీఎం అవుతాడు.

సీఎం అయ్యే అదృష్టం ఎన్టీఆర్ కి ఉంది అని తెలిపారు.ఇక ఎన్టీఆర్ తో మేము అల్లరి రాముడు సినిమా తీశాం.ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ సినిమా వల్ల నష్టాలు అయితే రాలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత చంటి అడ్డాల. ప్రస్తుతం ఈయన గతంలో మాట్లాడిన ఈ వీడియో మళ్లీ యూట్యూబ్లో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు తాత లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం అయ్యి రాష్ట్రాన్ని పాలించడం పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.