2026లో ఇన్నిఘోరాలా..? భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్ సంచలన జోస్యం..

కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది..తమకు ఎలాంటి మంచి, చెడు జరుగుతాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు.


ఈ క్రమంలోనే 2026 సంవత్సరానికి సంబంధించి అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే 2026 గురించి ఒక భయంకరమైన అంచనా వెలువడింది. ఇది యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు జరగవచ్చనే దానిపై నోస్ట్రాడమస్ అంచనాలు సంచలనం సృష్టించాయి

2026 కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది..? కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుంది..? రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉంటారు. వీటన్నిటి మధ్య రాబోయే వెయ్యి సంవత్సరాలలో తమ కాలంలో ఏం జరుగుతుందో ఊహించిన బాబా వంగా, నోస్ట్రాడమస్ ప్రసిద్ధ అంచనాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే మైఖేల్ నోస్ట్రాడమస్ 2026 లో ఏం జరుగుతుందో ఊహించాడు. ఈ అంచనా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

2026 లో ఏం జరుగుతుంది? దీని గురించి మైఖేల్ నోస్ట్రాడమస్ తన పుస్తకం లెస్ ప్రొఫెట్స్‌లో పూర్తి అంచనా వేశారు. మైఖేల్ నోస్ట్రాడమస్ డిసెంబర్ 14, 1503న ఫ్రాన్స్‌లో జన్మించాడు. 1566లో మరణించాడు. మైఖేల్ నోస్ట్రాడమస్ చేసిన అనేక ప్రవచనాలు నిజమయ్యాయని చెబుతుంటారు. నోస్ట్రాడమస్ ఇప్పుడు జీవించి లేనప్పటికీ, అతను తన పుస్తకంలో వెయ్యి సంవత్సరాల అంచనాలను వివరించాడు. అందులో అతను 2026 లో ఏం జరుగుతుందో దాని గురించి కూడా అంచనా వేశాడు. నోస్ట్రాడమస్ ఈ ప్రవచనం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది.

నోస్ట్రాడమస్ అంచనాల ప్రకారం, స్విట్జర్లాండ్‌లోని టిసినో నగరం ఈ సంవత్సరం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నగరం నుండి రక్తపు నదులు ప్రవహిస్తాయని నోస్ట్రాడమస్ అంచనా వేశాడు. ఇది స్విట్జర్లాండ్‌లోని అత్యంత అందమైన నగరం. ఈ నగరాన్ని సరస్సులు, నీటి బుగ్గల నగరం అని పిలుస్తారు. ఎత్తైన మంచు పర్వతాలను కూడా ఇక్కడ చూడవచ్చు. కానీ నోస్ట్రాడమస్ తన పుస్తకంలో ఈ నగరాన్ని ఎందుకు ప్రస్తావించాడు. ఇక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇంకా ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు.

నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం, 2026 లో ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దీనిలో అన్ని అగ్రరాజ్యాలు పాల్గొంటాయి. అపారమైన డబ్బు, ప్రాణనష్టం జరుగుతుంది. ఈ యుద్ధం ఏడు నెలల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన అంచనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చకు దారితీసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.