చనిపోయిన 3 నిమిషాల తర్వాత ప్రాణం పోసుకున్న యువతి: పరలోకం గురించి ఆమె చెప్పిన నిజాలకు ప్రపంచం షాక్

మెరికాలోని టెక్సాస్‌కు చెందిన ట్రిసియా బార్కర్ అనే మహిళ జీవితంలో జరిగిన ఒక అద్భుత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 21 ఏళ్ల వయస్సు వరకు దేవుడిని నమ్మని నాస్తికురాలిగా ఉన్న ట్రిసియా, ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు.


శస్త్రచికిత్స సమయంలో ఆమె గుండె ఆగిపోవడంతో వైద్యులు ఆమెను మూడు నిమిషాల పాటు మరణించినట్లు ప్రకటించారు. ఆ కొద్ది సమయంలోనే ఆమె అనుభవించిన పరలోక అనుభవాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

తమ శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చి ఆపరేషన్ థియేటర్‌లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించానని ట్రిసియా తెలిపారు. ఆ సమయంలో ఆమె తన చనిపోయిన బంధువులను మరియు ఒక కాంతి పురుషుడిని చూశానని, అలాగే వెయిటింగ్ రూమ్‌లో తన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో కూడా చూశానని వెల్లడించారు. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన విషయాలు అక్షరాలా నిజం కావడంతో వైద్యులు సైతం విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన తర్వాత ఆమె పూర్తి దైవచింతనతో టీచర్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.