Astrology: ఇంట్లోకి ఎలాంటి తాబేలును తీసుకురావాలి? ఫలితాలు ఎలా ఉంటాయి?

www.mannamweb.com


Astrology: జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో కొన్ని పనులు జరగాలంటే కొన్ని అనుకూలమైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. ఇల్లు సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.
అందుకోసం లక్ష్మీదేవతకు ఇష్టమైన కొన్నింటింటిని ఇంట్లో ఉంచుకోవాలి. అప్పుడే అనుకున్న పనులు ముందుకు వెళ్లాయి. కొందరు ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిల్వదు. మరికొందరి ఇళ్లల్లో నిత్యం సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి బటయపడడానికి ప్రత్యేక పూజలు చేయకపోయినా కొన్ని వస్తువుల ద్వారా నెగెటివ్ ఎనర్జీ పోయిన పాజిటివీటీ వస్తుంది. అలాంటి వాటిల్లో లోహమైన తాబేలు. తాబేలు ఇంట్లో ఉంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..

తాబేలు ఇంట్లో ఉండడం వల్ల ఎంతో మంచిది. ఒక్కోసారి నక్షత్ర తాబేలు కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుందని వింటుంటారు.ఇళ్లల్లో తాబేలు ఉండాలంటే బావి ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో ఆ అవకాశం లేదు. అయితే లోహంతో కలిగిన తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని కొందరు పండితులు చెబుతున్నారు. శ్రీ విష్ణువు కుర్మావతారాన్ని ఎత్తాడు.
అందువల్ల తాబేలు ఇంట్లో ఉండడం వల్ల మంచి పరిణామాలు ఉంటాయని అంటున్నారు.

అయితే ఏరకమైన తాబేలు ఇంట్లో ఉంచడం బెటర్? అనే వివారాల్లోకి వెళితే. ఏదైనీ లోహంతో ఉన్న తాబేలును ఇంట్లో ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో ఉంచాలి. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి. దీనిని ఉత్తర దిశలో ఉండడం వల్ల మరిన్ని ఫలితాలు ఉంటాయి.ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొన్న వాళ్లా కనకపు తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగానికి వెళ్లాలనుకునే వారు తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకోవాలి. వ్యాపారస్తులు తమ షాపుల్లో ఈ ప్రతిమను ఉంచుకోవడం వల్ల ఎంతో లాభం జరుగుతుంది.

నేటి కాలంలో చాలా మంది పిల్లలు చదువుపై శ్రద్ద వహించడం లేదు. అలాంటి సమస్య ఉన్నవారు వెండి లోహం తాబేలును ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఈ తాబేలు ప్రతిమ వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు.
అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారని వాస్తు శాస్త్రం చెబుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్య ఉన్న వాళ్లు స్పటిక తాబేలును తీసుకురావాలి. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.