మీ ఇంటి ముందు కొంచెం స్థలం ఉంటే చాలు.. వన్ టైం పెట్టుబడితో రోజుకు పదివేలు సంపాదించే ఛాన్స్

 మధ్యకాలంలో వైద్యులు ఉద్యోగులను తమ ఒత్తిడి జీవితంలో నుంచి బయటకు వచ్చేందుకు ఆటలు ఆడమని చెబుతున్నారు. ముఖ్యంగా క్రికెట్, బాడ్మింటన్ వంటి క్రీడలను ఆడటం ద్వారా ఒత్తిడి లైఫ్ స్టైల్ నుంచి బయటకు రావచ్చని సలహా ఇస్తున్నారు.


అయితే ప్రస్తుతం నగరాల్లో క్రికెట్ ఆడటానికి గ్రౌండ్స్ అనేవి కరువు అయిపోయాయి. రోడ్లమీద ఆడినట్లయితే పెద్ద న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వయసులో పెద్దవాళ్లు అయిపోయాక రోడ్డు మీద క్రికెట్ ఆడటం అనేది నామోషీగా కూడా ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఒక బిజినెస్ ఐడియా ద్వారా దీన్ని ఒక వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు.

బాక్స్ క్రికెట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. చుట్టూ నెట్స్ కట్టి లోపల ఎంచక్కా క్రికెట్ ఆడుకోవచ్చు. ఈ బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ ఏమిటంటే నలువైపులతోపాటు పైన కూడా నెట్ కడతారు. దీనివల్ల బంతి ఎంత బలంగా బారిన ఆ బాక్స్ లోపల ఉంటుంది బయటకు వెళ్ళదు. తక్కువ స్థలంలోనే మీరు ఎంచక్కా క్రికెట్ ఆడుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా క్రికెట్ షాట్స్ కొట్టవచ్చు. బంతిని ఎంత బలంగా బాదినా నెట్స్ కు తగిలి మళ్ళీ లోపల పడిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఈ బాక్స్ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. బాక్స్ క్రికెట్ ఒక ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసుకొని అందులో నెట్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.

200 గజాల నుంచి 500 గజాల వరకు ఖాళీ స్థలంలో మీరు ఈ నెట్ ఏర్పాటు చేసి చక్కగా విశాలమైన బాక్స్ క్రికెట్ పిచ్ తయారు చేసుకోవచ్చు. . అలాగే దీని లోపల లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రిళ్ళు కూడా బాక్స్ క్రికెట్ సేవలను అందించవచ్చు. నిజానికి బాక్స్ క్రికెట్ ప్రస్తుతం చాలా ట్రెండ్ అవుతోంది. ఖాళీ స్థలాలు దొరకని వారు బిల్డింగ్ పైన టెర్రస్ ఏరియాలో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు. గంటల చొప్పున ఈ బాక్స్ క్రికెట్ లో ఆటగాళ్ల నుంచి డబ్బు వసూలు చేయవచ్చు. ఒక గంటకు 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు చార్జర్ చేయవచ్చు. బౌలింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసి కోచింగ్ సైతం ఇవ్వవచ్చు. ప్రతినెల ఆడేవారికి మంత్లీ కార్డ్స్ ఇవ్వడం ద్వారా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే ఈ బాక్స్ క్రికెట్ ఎక్కువగా నగర శివారులలో కాకుండా చక్కగా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని  సూచిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.