ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ షురూ

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సేల్‌లో పాల్గొనే ఛాన్స్ కల్పించనుంది.


HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే, ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా యాపిల్, వివో, మోటోరోలా, రియల్‌మి, నథింగ్ వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ఇప్పటికే ప్రకటించాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIల ద్వారా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

ఐఫోన్ డీల్స్
* ఐఫోన్ 16 ప్రస్తుత ధర రూ.69,999గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.56,999కే లభించనుంది. అలాగే, గూగుల్ పిక్సల్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.74,999కి లభిస్తుండగా, రిపబ్లిక్ డే సేల్‌లో రూ.60,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

వివో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
* వివో T4 లైట్ 5G- రూ.9,999
* వివో T4x 5G- రూ.14,249
* వివో T4R 5G- రూ.18,999
* వివో T4 5G- రూ.20,499

నథింగ్ ఫోన్‌లపై తగ్గింపులు
* నథింగ్ ఫోన్ 3a ప్రో ప్రస్తుత ధర రూ.33,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైన తర్వాత రూ.26,999కే లభించనుంది. CMF ఫోన్ 2 ప్రో ప్రస్తుతం రూ.18,999కి అందుబాటులో ఉండగా, సేల్‌లో రూ.16,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే, నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999.. ఈ సేల్‌లో రూ.20 వేలలోపు దొరికే ఛాన్స్ ఉంది. నథింగ్ ఫోన్ 3 ప్రస్తుత ధర రూ.79,999గా ఉంది.. ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యానర్‌లో “Unbelievable Price” ట్యాగ్‌లైన్ కనిపించడంతో, భారీ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లతో రూ.40 వేలకి వచ్చే అవకాశం ఉందని అంచనా

మోటోరోలా స్మార్ట్‌ఫోన్ డీల్
* మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.22,999 ధరకు అందుబాటులో ఉండగా, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ.19,999కే కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లపై డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.