DA Hike: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్! డీఏ పెంపుపై కీలక అప్‌డేట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజంగా గుడ్ న్యూస్! హోలీకి ముందే డియర్‌నెస్ అలవెన్స్ (DA) మరో 5 శాతం పెరిగి 63 శాతానికి చేరే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణ భారం మధ్య ఇది లక్షల కుటుంబాలకు ఊరట కలిగించే నిర్ణయంగా మారొచ్చు. అధికారిక ప్రకటన మార్చి నెలలో, ముఖ్యంగా హోలీ పండుగకు ముందు రావచ్చని ఉద్యోగి సంఘాల వర్గాలు చెబుతున్నాయి.


డీఏ లెక్కలు అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI-IW) ఆధారంగా నిర్ణయిస్తారు. డిసెంబర్ సూచిక 148.2 వద్ద స్థిరంగా ఉండటంతో, ప్రస్తుత గణాంకాల ప్రకారం డీఏ 63 శాతానికి చేరే లెక్కలు సరిపోతున్నాయి. గత జూలైలో 54 శాతం నుంచి 58 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే సవరణ ప్రక్రియలో భాగంగా జనవరి నుంచి పెంపు అమలులోకి రావాల్సి ఉంది.

DA Hike డబ్బు ఎప్పుడు చేతికి?
అధికారిక ప్రకటన మార్చిలో వెలువడితే, పెంచిన డీఏ ఏప్రిల్ జీతంతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, 2026 జనవరి నుంచి వర్తించే బకాయిలు కూడా ఒకేసారి జమయ్యే అవకాశముంది. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో మంచి మొత్తమే చేరే ఛాన్స్ ఉంది.

8వ వేతన సంఘం పరిస్థితి ఏంటి?
ఇక 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ప్రక్రియ కూడా మొదలైంది. కేంద్రం ఇప్పటికే విధివిధానాలకు (ToR) ఆమోదం తెలిపింది. అయితే కమిషన్ తన సిఫార్సులు ఇవ్వడానికి దాదాపు 18 నెలలు పట్టొచ్చని అంచనా. ఆ వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఏడవ వేతన సంఘం పరిధిలోనే కొనసాగుతారు. అందుకే ఈ డీఏ పెంపు ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంగా భావిస్తున్నారు.

న్యూఢిల్లీలో 8వ వేతన సంఘం కార్యాలయం ప్రారంభమైంది. ఫిబ్రవరి 25న ప్రధాన ఉద్యోగి సంఘాలు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించనున్నాయి. వేతన పునరుద్ధరణ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, అలవెన్సులు, సేవా షరతులు వంటి అంశాలపై ఉమ్మడి మెమోరాండం సిద్ధం చేస్తున్నారు.

ఉద్యోగి సంఘాల డిమాండ్లు
అఖిల భారత ఎన్‌పీఎస్ ఉద్యోగుల సమాఖ్య దేశవ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమం చేపట్టింది. సుమారు 400 జిల్లాల్లో ప్రతినిధులు పాల్గొంటూ ముఖ్యమైన డిమాండ్లను వినిపిస్తున్నారు. 8వ వేతన సంఘం 200 రోజుల్లో నివేదిక సమర్పించాలని, కేంద్ర నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకరీతిగా అమలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర సిబ్బందికి సమానమైన వేతన నిర్మాణం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారిక సమాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్
ప్రభుత్వం www.8cpc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో కమిషన్ విధివిధానాలు, కూర్పు, ప్రశ్నాపత్రం, డేటా పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సూచనలు, అభిప్రాయాలను నేరుగా సమర్పించే వీలుంది.

 

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.