హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మార్చి మొదటి వారంలో డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక డిఏ పైన కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే, దాదాపు ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది ఎంతో ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మార్చి మొదటి వారంలో డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక డిఏ పైన కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే, దాదాపు ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది ఎంతో ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. నిజానికి 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025న పూర్తయింది. అయితే నూతన వేతన సంఘం ఏర్పాటు జరిగింది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందడానికి కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రకటించే డియర్ నెస్ అలవెన్స్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
డిఎ ఎప్పుడు మారుతుంది ?
డియర్నెస్ అలవెన్స్ సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. మొదటి ప్రకటన జనవరి నుండి అమలులోకి వస్తుంది. అయితే దీన్ని సాధారణంగా మార్చిలో ప్రకటిస్తారు. రెండవ డీఏ ప్రకటన జూలై నుంచి ప్రారంభం అవుతుంద. కానీ దీన్ని సాధారణంగా దీపావళి సందర్భంగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి డీఏ ప్రకటన హోలీకి ముందు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డీఏ 60 శాతానికి చేరుకునే అవకాశం
చివరి సారిగా ప్రకటించిన డీఏ ప్రకారం చూస్తే డిసెంబర్ 2025 నాటికి డీఏ 58 శాతంగా ఉంది. జూలై నుండి డిసెంబర్ 2025 వరకు 3 శాతం పెరుగుదల తర్వాత ఈ రేటుకు చేరుకుంది. ఇప్పుడు, ద్రవ్యోల్బణ రేటు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, జనవరి 2026 నుండి మరో 2 శాతం పెరుగుదల గురించి చర్చ జరుగుతోంది. ఇది జరిగితే, డీఏ 60 శాతానికి చేరుకోవచ్చు.
ఇదిలా ఉంటే నవంబర్ 3, 2025న 8వ వేతన సంఘం అధికారంగా అమల్లోకి రాగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను (ToR) జారీ చేశారు. అయితే సాధారణంగా డీఏను ప్రాథమిక వేతనంలో కలపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం అలాగే ఎనిమిదవ వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎనిమిదవ వేతన సంఘం ఇప్పటికే ఉద్యోగుల నుంచి అలాగే ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో ఉంది.



































