దేశంలోని ధనిక, పేద రాష్ట్రాల జాబితా విడుదల చేసిన ఆర్బీఐ! ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?

RBI Handbook : సుమారు 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్, జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2028 నాటికి, భారతదేశం జర్మనీని అధిగమించి $5.7 ట్రిలియన్ల GDPతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది.


2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత్ వాస్తవ GDP వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశం ఈ స్థితికి చేరుకోవడంలో రాష్ట్రాల సహకారాన్ని తక్కువ అంచనా వేయలేము.

ఈ సందర్భంలో, RBI హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ భారతదేశంలోని అత్యంత ధనిక, పేద రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. డేటా ప్రకారం, మహారాష్ట్ర మరోసారి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP)లో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. ఈ డేటా భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సమగ్రవివరాలను అందిస్తుంది. ఈ ర్యాంకింగ్ ప్రస్తుత ధరల్లో లెక్కించి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. ఇది ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో? ఎక్కడ తక్కువగా ఉన్నాయో? సూచించడంలో సహాయపడుతుంది.

దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితా

1. మహారాష్ట్ర – ₹45.32 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

2. తమిళనాడు – ₹31.19 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

3. ఉత్తరప్రదేశ్ – రూ. 29.78 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

4. కర్ణాటక – ₹28.84 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

5. పశ్చిమ బెంగాల్ – ₹18.15 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

6. రాజస్థాన్ – ₹17.04 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

7. తెలంగాణ – ₹16.41 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

8. ఆంధ్రప్రదేశ్ – ₹15.93 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

9. మధ్యప్రదేశ్ – రూ. 15.03 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

10. ఢిల్లీ – ₹12.15 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ

ఇది మహారాష్ట్ర అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని స్పష్టంగా చూపిస్తుంది. పరిశ్రమల వృద్ధి నుంచి సేవలు, ఆర్థికం వరకు ప్రతిదానిలోనూ ఈ రాష్ట్రం ముందుంది. తయారీ, సేవల ఆధారితంగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. సాంకేతికత, సేవల విషయంలో కర్ణాటక నాల్గో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దేశ ఆర్థిక కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయి.

అత్యల్ప GSDP కలిగిన 10 రాష్ట్రాలు (దిగువ నుంచి పైకి)

1. అరుణాచల్ ప్రదేశ్ – రూ. 4,423 కోట్ల ఆర్థిక వ్యవస్థతో అట్టడుగున ఉంది.

2. త్రిపుర – 8,968 కోట్లు

3. హిమాచల్ ప్రదేశ్ – ₹23,169 కోట్లు

4. జమ్మూ కాశ్మీర్ – ₹26,246 కోట్లు

5. ఉత్తరాఖండ్ – రూ. 37,824 కోట్లు

6. జార్ఖండ్ – ₹51,626 కోట్లు

7. ఛత్తీస్గఢ్ – ₹56,788 కోట్లు

8. అస్సాం – 64,367 కోట్లు

9. పంజాబ్ – 83,864 కోట్లు

10. ఒడిశా – ₹89,004 కోట్లు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.