SC on Welfare Schemes: ఉచిత పథకాలపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయని ఫైర్!

SC on Welfare Schemes: రాజకీయ పార్టీలు.. ఓట్ల కోసం ఉచిత పథకాల్ని ఉపయోగిస్తున్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. పథకాలు ఇస్తున్నా.. ప్రభుత్వాల్ని పడగొడుతూ.. మరింత బెటర్ పథకాల కోసం ట్రై చేస్తున్నారు.
ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. జనరల్‌గా పేదలు ఇవ్వాలి అంటారు. టాక్స్ చెల్లించేవారిలో కొంతమంది వద్దు అంటారు. మరికొందరు.. నిజంగా అవసరమైన వారికే ఇవ్వాలి అంటారు. ఇలా.. ఈ అంశంపై రకరకాల వాదనలు ఉంటాయి. మరి వాస్తవమేంటి అంటే.. చాలా ఉచిత పథకాలను అర్హులతోపాటూ.. అనర్హులు కూడా తీసుకుంటున్నారు. ఫలితంగా ఆ పథకాల అసలు ఉద్దేశం నెరవేరట్లేదు. పైగా.. ప్రభుత్వాలకు తీవ్రమైన ఆర్థిక భారం అవుతోంది. ఒకప్పుడు.. ఆర్థిక లోటు అనేది లేకుండా ప్రభుత్వాల పాలన ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాలు పథకాల కోసం అప్పులు చేస్తున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కుండబద్ధలు కొట్టింది.
ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు, ఉచిత విద్యుత్ పథకాలపై విచారణ చేస్తూ రాష్ట్రాలను తీవ్రంగా విమర్శించింది సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పాంచోలి ధర్మాసనం. “ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. రాష్ట్రాలు ఆదాయ లోటుతో కష్టపడుతున్నప్పటికీ ఉచితాలు కొనసాగిస్తున్నాయి. ఈ పథకాలకు డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? పన్ను చెల్లింపుదారులే కదా? ఇంకెవరూ కాదు కదా?” అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని సూచించింది. అంటే.. ఆకలి వేసిన వారికి చేపలు ఇవ్వకుండా.. చేపలు పట్టడం నేర్పాలి అనే చైనా సామెతను సుప్రీంకోర్టు చెప్పినట్లైంది.
తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడాన్ని ప్రత్యేకంగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. “ఇలాంటి ఆకస్మిక ప్రకటనలు పవర్ డిస్కామ్‌లను ఇబ్బంది పెడతాయి. టారిఫ్‌లు, బడ్జెట్ లెక్కలు సరి చేయడం కష్టమవుతుంది. ముందుగా ప్రకటించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు” అని ధర్మాసనం అంది. ఇలాంటి ఉచితాలు దేశ ఆర్థిక అభివృద్ధిని ఆపేస్తాయని హెచ్చరించింది.


 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.