ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు.. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడి అరెస్ట్

ఎప్‌స్టీన్స్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ ఫైళ్లలో బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు, మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్ పేరు కూడా ఉంది. ఈ విషయం యూకేలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ గురించి పోలీసులు ఓ ప్రకటన చేశారు.


అయితే, ఆండ్రూ పేరును బయటకు చెప్పలేదు. పదవీ దుర్వినియోగం ఆరోపణల కింద ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ బాధితురాలు ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆండ్రూ మూడు సార్లు లైంగికదాడి చేశారని అంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆండ్రూ రాయల్ టైటిల్‌ను వదులుకున్నారు. అంతేకాదు.. అన్ని రాజ బిరుదులు, గౌరవాలు, అధికారాలను సైతం కోల్పోయారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.