జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సరికొత్త రియాలిటీ షోను ప్రారంభించనుంది. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్’ (Mad For Each Other) షోను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ప్రేమ, విశ్వాసం, పార్టనర్‌షిప్‌ను ఒకే ఇంట్లో ఉంచి పరీక్షించే బోల్డ్ రియాలిటీ షోగా దీనిని రూపొందిస్తున్నారు. ‘ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్’ పేరుతో వస్తున్న ఈ షోలో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. భావోద్వేగాల నడుమ సాగే ఈ ప్రయాణంలో బలం, అనుబంధం, నమ్మకం, మోడరన్ ప్రేమలోని విభిన్న కోణాలను ఈ షో ఆవిష్కరించనుంది.
‘10 మంది కపుల్స్.. 70 రోజులు, ఒక విల్లా.. అనే ఆసక్తికరమైన లైన్‌తో సోషల్ మీడియాలో విడుదల చేసిన గ్లింప్స్‌కు చక్కని ఆదరణ దక్కుతోందని నిర్వాహకులు వెల్లడించారు. రొమాన్స్, డ్రామా, ఎమోషన్స్, ట్విస్ట్స్ మొదటి రోజు నుంచే ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని, టఫ్ టాస్కులు, రిలేషన్షిప్‌ని పరీక్షించే పరిస్థితులు ఎన్నడూ చూడని అనుభూతిని కలిగిస్తాయని జియో హాట్‌స్టార్ తెలిపింది. ఈ షోలో పాల్గొనే జంటలు ఎవరు? వాళ్లు ఎదుర్కోబోయే సవాళ్లేంటి అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ షో ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.


































