చదువు కొనసాగిస్తానని టవరెక్కిన వివాహిత

ఈటీవీ భారత్‌: ప్రేమ కోసం.. పెళ్లి కోసం టవర్లెక్కిన ఉదంతాలు చూశాం. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లా బోర్సీ గ్రామంలో ఓ వివాహిత యువతి చదువు కొనసాగింపునకు కుటుంబసభ్యులు అనుమతించాలని, కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పొలాల్లోని 400 కిలోవాట్ల హైటెన్షన్‌ విద్యుత్తు టవరుపైకి ఎక్కింది. గ్రామస్థులు పెద్దసంఖ్యలో టవరు చుట్టూ గుమికూడారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెతో చర్చలు జరిపారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ తర్వాత ఆమె చదువుకునేందుకు అనుమతిస్తూ భర్త కుటుంబం ఆమోదం తెలపడంతో యువతి కిందికి దిగి వచ్చింది.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.