Vastu Tips: ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకుంటే..!

వాస్తు శాస్త్రం కేవలం ఇల్లు ఎలా నిర్మించాలి, ఎలా అలంకరించాలి అనే మార్గదర్శకత్వం మాత్రమే ఇవ్వదు. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, కుటుంబ సమస్యలకు కూడా పరిష్కార మార్గాలను సూచించే శాస్త్రంగా భావించబడుతుంది. కొన్ని చెట్లను చాలా పవిత్రంగా భావిస్తాం. ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే.. మీ ఇల్లు లక్ష్మీదేవిచే ఆశీర్వాదం పొందుతుంది. మీకు అప్పు ఉంటే సత్వరంగా వదలించుకుంటారు. వాస్తు ప్రకారం కొన్ని చెట్లు, పక్షులు ఇంటి పరిసరాల్లో లేదా చిత్రరూపంలో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది. అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నీలకంఠ పక్షి (Indian Roller)
నీలకంఠ పక్షిని వాస్తు శాస్త్రంలో ఎంతో శుభప్రదంగా భావిస్తారు. నీలకంఠ పక్షిని చూడటం అదృష్టానికి సంకేతమని నమ్మకం. వాస్తు ప్రకారం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు లేదా సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోతే, హాల్‌లో నీలకంఠ పక్షి ఫోటోను ఉంచడం మంచిదని చెబుతారు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు.

నెమలి, నెమలి ఈకలు (Indian Peafowl)
నెమలి లేదా దాని ఈకలను కూడా వాస్తులో శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో నెమలి ఫోటో లేదా నెమలి ఈకను ఉంచడం వలన ఆర్థిక లాభం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపార విజయాలు సాధ్యమవుతాయని చెబుతారు. నెమలి ఈకను ఇంటి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం శ్రేయస్కరమని భావిస్తారు.

లవ్ బర్డ్స్ (Lovebirds)
లవ్ బర్డ్స్ జంటల మధ్య ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా భావించబడతాయి. భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నట్లయితే, బెడ్‌రూమ్‌లో లవ్ బర్డ్స్ జంట ఫోటోను ఉంచడం మంచిదని వాస్తు సూచిస్తుంది. ఇది సంబంధాలలో ఉద్రిక్తత తగ్గించి, అనవసర విభేదాలను దూరం చేస్తుందని విశ్వాసం.

అయితే, ఇవి సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడిన సూచనలు మాత్రమే. వాస్తవ జీవితంలో ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం కోసం క్రమశిక్షణ, పరస్పర అవగాహన, సమర్థమైన ప్రణాళిక కూడా అంతే ముఖ్యమైనవి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.