దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్ నాటికి దేశ వ్యాప్తంగా 22 ఫేక్ యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 32కి చేరడం గమనార్హం.
దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల (fake universities in India) సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ నాటికి దేశ వ్యాప్తంగా 22 ఫేక్ యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 32కి చేరడం గమనార్హం. యూనివర్సిటీల్లో చేరాలనుకొనే విద్యార్థుల అవసరాన్ని, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొనేందుకు నకిలీ వర్సిటీలు(Fake Universities)పుట్టుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. అడ్మిషన్ల సీజన్ నేపథ్యంలో యూజీసీ వెల్లడించిన జాబితా ప్రకారం దేశంలో ఫిబ్రవరి నాటికి 32 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దేశ రాజధాని నగరం దిల్లీలోనే 12 నకిలీ వర్సిటీలు ఉండగా.. యూపీ (4), ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్లో రెండేసి చొప్పున.. రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్కొక్కటి ఉన్నాయి.



































