Bill Gates: ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయి కానీ: ఎప్‌స్టీన్ కుంభకోణంపై బిల్‌గేట్స్

ఎప్‌స్టీన్స్‌తో సంబంధాలు ఉండటంపై క్షమాపణలు చెప్పిన బిల్‌గేట్స్
ఆయన నేరాల్లో భాగస్వామ్యం కాలేదని స్పష్టీకరణ
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో వెల్లడించిన బిల్‌గేట్స్
సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో తన పేరు ఉండటంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఎప్‌స్టీన్స్‌తో సంబంధాలు ఉన్నాయని, కానీ ఆయన నేరాల్లో భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్స్‌తో తనకు సంబంధం ఉండటంపై బిల్ గేట్స్ తన గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు.


తాను చట్టవిరుద్ధంగా ఏ పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆయన అంగీకరించడం గమనార్హం. నేరాల్లో మాత్రం భాగస్వామ్యం లేదని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇంటర్వ్యూలో ఈ అంశాలను పేర్కొన్నారు.

ఎప్‌స్టీన్స్‌తో సంబంధాలు, అతని సమావేశాలలో గేట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్‌ల పాల్గొనడం తాను చేసిన తప్పు అని అంగీకరించారు. ఎప్‌స్టీన్ నేరాలు తమ ఫౌండషన్ విలువలకు, లక్ష్యాలకు వ్యతిరేకమని తెలిపారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు తమ ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.