చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్‌ రాజన్‌ కన్నుమూత

చిలుకూరు: చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్‌ రాజన్‌ (90) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం చిలుకూరులోని నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన తనయుడు, ఆలయ ప్రస్తుత ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ వెల్లడించారు.


తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో చిలుకూరు బాలాజీ ఆలయం ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ బాలాజీ ఆలయంలో అర్చక సేవలు చేస్తున్న.. ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్(Chilkur Balaji Temple Chief Priest Soundararajan) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కాగా, సౌందరరాజన్ తన అర్చక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యనభ్యసించాడు. కామర్స్ లెక్చరర్‌గా చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. ముగ్గురు మగపిల్లల్లో రంగరాజన్(ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు) రెండో వాడు. సౌందర్‌రాజన్ మరణవార్త తెలిసి అర్చకలోకం విషాదంలో మునిగిపోయింది. సౌందర్‌రాజన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దైవాన్ని వేడుకుంటున్నారు