టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ విజయం తర్వాత హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పోడియంపై ఇద్దరూ పడుకుని సెలబ్రేట్ చేసిన వీడియో వైరల్ కావడంతో కొంతమంది అభిమానులు సివిక్ సెన్స్ లేదు అంటూ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో హార్దిక్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇంకా 10 సంవత్సరాలు క్రికెట్ ఆడి మరిన్ని ఐసీసీ టైటిళ్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
మ్యాచ్ ముగిసిన అనంతరం పోడియంపై హార్దిక్ పాండ్యా , మహికా శర్మ ఇద్దరూ పోడియంపై పడుకుని సెలబ్రేట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆ సమయంలో హార్దిక్ పాండ్యా తన భుజాలపై భారత జాతీయ జెండాను చుట్టుకుని కనిపించాడు. అయితే ఈ చర్యపై కొంతమంది అభిమానులు విమర్శలు గుప్పిస్తూ జీరో సివిక్ సెన్స్ అంటూ ట్రోల్ చేశారు.
హార్దిక్ పాండ్యా, మహికా శర్మ తమ రిలేషన్‌షిప్‌ను 2025 అక్టోబర్‌లో పబ్లిక్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ పలు పబ్లిక్ ఈవెంట్లలో, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కలిసి కనిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో కూడా మహికా శర్మ స్టేడియంలో కనిపిస్తూ పాండ్యాకు మద్దతుగా చీర్ చేసింది. అతని కుమారుడు అగస్త్యతో కూడా ఆమె సమయం గడిపిన సందర్భాలు కనిపించాయి.

































