హైదరాబాద్: బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇన్ని రోజులు తన పొట్టను దాచలేక విసిగిపోయానని ఫన్నీ కామెంట్ చేశారు. ‘‘ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాను. జులై నాటికి నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి నా శరీరాకృతి మారుతుందని ఆశిస్తున్నాను’ అని జిమ్‌లో ఉన్న ఫొటోను పంచుకున్నారు.

































