BSNL Prepaid Plans: కొంతకాలంగా ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతున్న తరుణంలో.. ప్రభుత్వ రంగ సంస్థ BSNL తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఇప్పుడొక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనివల్ల మార్కెట్లోని అగ్రగామి కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
14 రోజుల అదనపు వ్యాలిడిటీ..
BSNL తన పాపులర్ రూ.997 ప్లాన్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ప్రకారం.. మార్చి 31వ తేదీలోపు రీఛార్జ్ చేసుకునే వారికి అదనంగా 14 రోజుల వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. దీంతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే మొత్తం 164 రోజుల పాటు ఈ సేవలను వాడుకోవచ్చు. దాదాపు ఐదున్నర నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వాళ్లు ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు.
అన్‌లిమిడెట్ డేటా & కాలింగ్..
ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీకే పరిమితం కాలేదు. దీనిలో ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. పెరిగిన వ్యాలిడిటీతో కలిపి చూస్తే వినియోగదారులు మొత్తం 328GB డేటాను పొందుతారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. రోజుకు 100 SMSలతో పాటు వినోదం కోసం B-TV Subscription కూడా ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా లైవ్ టీవీ ఛానెళ్లను నేరుగా మొబైల్‌లోనే వీక్షించవచ్చు.
అతి తక్కువ ధరలో డేటా ప్యాక్..
బిఎస్‌ఎన్‌ఎల్ భారీ ప్లాన్‌లతో పాటు చిన్న అవసరాల కోసం కూడా కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఇటీవల కేవలం రూ.16కే 4GB డేటా ఇచ్చే కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్, అత్యవసరంగా డేటా కావాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు, వీడియో స్ట్రీమింగ్ చేసే సమయంలో డేటా అయిపోతే, ఇది చాలా తక్కువ ధరలో లభించే బెస్ట్ ఆప్షన్. నాణ్యమైన సేవలను తక్కువ ధరలో అందించడం ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ ఫామ్‌లోకి వస్తోంది.

































