సబ్జా గింజలు ఇలా తీసుకుంటే మధుమేహం కంట్రోల్, గుండె సేఫ్, మరెన్నో

బ్జా గింజలు. వీటికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలం టే సబ్జా ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా వీటికి ప్రత్యేక స్థానం ఉంది.


కేవలం చలవ కోసమే కాకుండా, బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు లేదా వడదెబ్బ తగిలినప్పుడు, గ్లాసు నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను కలుపుకుని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాగా.. సబ్జా గింజలు మధుమేహం నియంత్రణతో పాటుగా గుండె.. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే.. సబ్జా గింజలు ఎలా తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారికి సబ్జా గింజలు ఒక అద్భుతమైన డైట్ టిప్. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది, తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలలో లేదా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే, మరుసటి రోజు ఉదయం జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది కడుపులో మంట, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం మంచిది.

నిపుణుల సూచనలు

సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలు పడకుండా, మొటిమలు రాకుండా నిరోధిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. సబ్జా గింజల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు నీటిలో వేయాలి. అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. చలవ కోసం పైన పుదీనా ఆకులు వేసి చల్ల చల్లగా తీసుకోవటం ద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సబ్జా గింజలతో చేసే డ్రింక్‌ శరీరానికి గంటల తరబడి హైడ్రేషన్‌ అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.