ఏపీలో ఈ 5 నగరాలకు చంద్రబాబు తీపికబురు.. ఏకంగా రూ.250కోట్లు కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచడానికి కీలక నిర్ణయం తీసుకుంది.


రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో మోడల్ ఈ-మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి రూ.250 కోట్లు కేటాయించింది. ఒక్కో నగరానికి రూ.50 కోట్లు చొప్పున ఖర్చు చేసి ఈ-వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది.

ఐదు నగరాలలో మోడల్ ఈ మొబిలిటీ వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు నగరాలలో మోడల్ ఈ మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక్కో నగరానికి 50 కోట్ల చొప్పున కేటాయించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. వీటి కోసం అధిక సామర్థ్యం గల EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది.ప్రతి 9 కి.మీ.లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా నిర్ణయించింది.

చార్జింగ్ స్టేషన్లతో పాటు మౌలిక వసతుల కల్పన

ఇంటర్‌సిటీ రహదారులపై ప్రతి 30 కి.మీ.కి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు గ్రీన్ రోడ్లు & జీరో ఎమిషన్ జోన్ల అభివృద్ధి చేయనుంది. వీటి కోసం విద్యుత్ గ్రిడ్ బలోపేతం చేస్తుంది. బ్యాటరీ స్వాప్ (మార్పిడి) సౌకర్యాలు కూడా కల్పించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పైన ప్రజలకు ప్రోత్సాహకాలను అందించనుంది.

రూ.250 కోట్ల ప్రత్యేక నిధితో ఐదు నగరాల్లో ఈ మొబిలిటీ హబ్ లు

ఈ ప్రణాళిక ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గించి, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టీసీ కూడా డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో రూ.250 కోట్ల ప్రత్యేక నిధితో విశాఖ, విజయవాడ, తిరుపతి సహా ఐదు నగరాలు ఈ-మొబిలిటీ హబ్‌లుగా అభివృద్ధి చెందనున్నాయి. ఈ నగరాలలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తే పొల్యూషన్ తగ్గుతుంది.

ఈవీ వాహనాల విషయంలో ఏపీకి కేంద్రం సాయం

కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈవీలను ప్రోత్సహిస్తోంది. FAME-II స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, టూ-వీలర్ల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్రం నుంచి గణనీయమైన సాయం అందుతోంది. దీని భాగంగా రాష్ట్రంలో వేలాది ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.