ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన అత్యంత ప్రజాదరణ పొందిన ‘Z’ సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విస్తరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
రాబోయే మే 6, 2026న మలేషియా వేదికగా iQOO Z11 , iQOO Z11x మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే భారతదేశంలో Z11x మోడల్ అందుబాటులో ఉండగా, త్వరలోనే Z11 వేరియంట్ కూడా ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
iQOO Z11 గ్లోబల్ వేరియంట్.. చిప్‌సెట్‌లో భారీ మార్పులు
చిప్‌సెట్: చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే గ్లోబల్ వేరియంట్ iQOO Z11లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఉండగా, గ్లోబల్ మార్కెట్ కోసం Snapdragon 7s Gen 4 శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.
పెర్ఫార్మెన్స్: గీక్‌బెంచ్ స్కోర్ల ప్రకారం, ఈ ఫోన్ సింగిల్-కోర్‌లో 1,214 , మల్టీ-కోర్‌లో 3,091 స్కోరు సాధించింది (మోడల్ నంబర్ Vivo I2512). ఇందులో Adreno 810 GPU ఉండటం వల్ల గేమింగ్ , మల్టీటాస్కింగ్‌కు ఇది అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ సరికొత్త Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది , ఇందులో 12GB వరకు ర్యామ్ సపోర్ట్ ఉంటుంది.
iQOO Z11 ప్రధాన ఫీచర్లు (అంచనా)
డిస్‌ప్లే: చైనా వేరియంట్ , లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ హై-ఎండ్ ఫీచర్లతో వస్తోంది. 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్, దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ తోడుగా ఉంటుంది.
బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 9,020mAh బ్యాటరీ. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా: OIS (Optical Image Stabilization) సపోర్ట్ ఉన్న 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ సెటప్ ఉంటుంది.
iQOO Z11x.. బ్యాటరీ బీస్ట్.!
డిస్‌ప్లే: ఇప్పటికే మార్చి 2026లో భారతదేశంలో లాంచ్ అయిన iQOO Z11x ఫీచర్లు గమనిస్తే. 6.76 ఇంచ్ FHD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్.
ప్రాసెసర్: MediaTek Dimensity 7400 Turbo చిప్‌సెట్.
బ్యాటరీ: 7,200mAh బ్యాటరీ , 44W ఫాస్ట్ ఛార్జింగ్.
కెమెరా: 50MP + 2MP రియర్ కెమెరా , సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
లాంచ్ వివరాలు , ధర
మలేషియాలో మే 6న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్లు ఇతర దేశాల్లో అందుబాటులోకి వస్తాయి. భారతదేశంలో iQOO Z11x ప్రారంభ ధర సుమారు రూ. 18,999 గా ఉంది. iQOO Z11 కూడా ఇదే ధర శ్రేణిలో లేదా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అద్భుతమైన గేమింగ్ అనుభవం , రోజుల తరబడి ఛార్జింగ్ నిలిచే భారీ బ్యాటరీ కావాలనుకునే వారికి iQOO Z11 సిరీస్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. గ్లోబల్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ల పూర్తి అధికారిక ధరలు , లభ్యతపై స్పష్టత రానుంది.






















