పొగ రాయుళ్లకు పొగబెట్టే వార్త.. ఇక సిగరెట్ కొనాలంటే భయపడాల్సిందే

దేశంలో సిగరెట్ ధరలు మరోసారి పెరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడంతో ధరలు ఎగబాకాయి.


ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడంతో ధరలు ఎగబాకాయి. ఇప్పుడు మరోసారి కంపెనీలు ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడనుంది.

ధరలు ఎందుకు మళ్లీ పెరుగుతున్నాయి?

ఇటీవల కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, GSTలను పెంచిన కారణంగా సిగరెట్ ధరలు ఇప్పటికే పెరిగాయి. దీంతో చాలా మంది వినియోగదారులు తగ్గడంతో అమ్మకాలు పడిపోయాయి. ఈ పరిస్థితిలో నష్టాలను తగ్గించుకోవడానికి కంపెనీలు మళ్లీ ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. అంటే అమ్మకాలు తగ్గినా, ఒక్కో ప్యాక్‌పై లాభం పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.

ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది?

సిగరెట్ ధరలు దాదాపు 15 నుంచి 17 శాతం వరకు పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్రాండ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు కింగ్ సైజ్ సిగరెట్ ధర రూ.20 నుంచి రూ.28 వరకు పెరిగింది. అలాగే ప్రీమియం ప్యాక్‌ల ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఐటీసీ లిమిటెడ్ ఉత్పత్తులు, గాడ్ ఫ్రె ఫిలిప్స్ ఇండియా బ్రాండ్ల ధరలు కూడా పెరగవచ్చని మార్కెట్ అంచనా.

వినియోగదారులు, మార్కెట్‌పై ప్రభావం

ధరలు పెరగడం వల్ల వినియోగదారులు తక్కువ ధర ఉన్న బ్రాండ్ల వైపు వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది పూర్తిగా సిగరెట్ వినియోగం తగ్గించే అవకాశమూ ఉంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో సిగరెట్ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి. ధరలు పెంచడం ద్వారా కంపెనీలు తమ ఆదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాయి. కానీ వినియోగదారులకు మాత్రం ఖర్చు మరింత పెరగడం ఖాయం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.