ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సర్వేలపై అధికారపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ సర్వే పార్టీకి వచ్చే సీట్లతో పాటు ఎంత శాతం ఓట్లు సాధిస్తాయనే విషయాన్ని ఈ సర్వే తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 48వేల శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది.

April 21st to 5th May-images-26.jpg

Related News

April 21st to 5th May-images-27.jpg

AP Elections: ‘‘నవ సందేహాలు’’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?

పయోనీర్స్ సర్వేలో ఏముంది..

పయోనీర్స్ ప్రీపోల్ సర్వే పేరిట ఓ రిపోర్టు సామాజిక మాద్యమాల్లో ఎక్కువుగా వైరల్ అవుతోంది. ఏప్రియల్ 21 నుంచి 5 మే మధ్య ఈ సర్వే చేసినట్లు రిపోర్టులో ఉంది. దాదాపు 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే చేసినట్లు ఆ నివేదికలో ఉంది. సీట్ల పరంగా ఎన్డీయే కూటమి 126 అసెంబ్లీ, 20 లోక్‌సభ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా..వైసీపీ 33 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో ఉంది. 16 శాసనసభా స్థానాల్లో గట్టి పోటీ ఉందని పేర్కొంది. గత సర్వేలో మాత్రం ఎన్డీయే కూటమి 116 అసెంబ్లీ, 19లోక్‌సభ సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గత సర్వేతో పోలిస్తే టీడీపీకి 10 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వైసీపీకి 13 స్థానాలు తగ్గుతాయని చెప్పింది. ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయేకు 50.02 శాతం, వైఎస్సార్‌సీపీకి 44.12 శాతం, ఇండియా కూటమికి 3.96 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

లోక్‌సభ స్థానాలవారీ..

పయోనీర్స్ పేరిట వైరల్ అవుతున్న సర్వేలో లోక్‌సభ స్థానాల్లో ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి.. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో ఈ సర్వే తెలిపింది. పార్లమెంట్ స్థానాలవారీ ఓట్ల శాతం కింది విధంగా ఉన్నాయి.

April 21st to 5th May-images-1.jpg

April 21st to 5th May-images-2.jpgApril 21st to 5th May-images-3.jpg

April 21st to 5th May-images-4.jpgApril 21st to 5th May-images-5.jpgApril 21st to 5th May-images-6.jpgApril 21st to 5th May-images-7.jpgApril 21st to 5th May-images-8.jpgApril 21st to 5th May-images-9.jpgApril 21st to 5th May-images-10.jpg

April 21st to 5th May-images-11.jpgApril 21st to 5th May-images-12.jpgApril 21st to 5th May-images-13.jpgApril 21st to 5th May-images-14.jpgApril 21st to 5th May-images-15.jpgApril 21st to 5th May-images-16.jpgApril 21st to 5th May-images-17.jpgApril 21st to 5th May-images-18.jpgApril 21st to 5th May-images-19.jpgApril 21st to 5th May-images-20.jpg

April 21st to 5th May-images-21.jpgApril 21st to 5th May-images-22.jpgApril 21st to 5th May-images-23.jpgApril 21st to 5th May-images-24.jpgApril 21st to 5th May-images-25.jpg

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *