Ap news: బస్సు సీటు కోసం రూ. 11 లక్షలు పోగోట్టుకున్న వ్యాపారి

ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ వ్యాపారి రూ. 11 లక్షల నగదుతో పాటు బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది.


ఓ వ్యాపారీ తన బ్యాగులో బంగారంతో పాటు రూ. 11 లక్షల నగదు పెట్టుకుని వేరే ఊరికి బయల్దేరారు. ఈ మేరకు నర్సాపురం ఆర్టీసీ బస్సాండ్ వద్దకు వెళ్లారు. అయితే బస్సు కోసం చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

అంతలో బస్సు రావడంతో ప్రయాణికులు సీటు కోసం ప్రయత్నం చేశారు. వ్యాపారి కూడా బస్సులో సీటు కోసం ప్రయత్నం చేశారు. తన వద్దనున్న బ్యాగును బస్సు కిటీలో నుంచి సీటులో వేశారు. ఆ తర్వాత బస్సు ఎక్కి సీటు వద్దకు వెళ్లారు. అయితే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. సీటులో బ్యాగు లేదు. దాంతో ఆందోళన చెందారు. తన బ్యాగు గురించి అందరినీ అడిగారు. అయితే ఎవరూ తమకు తెలియదని చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బస్టాండ్ వద్దకు వెళ్లి ఆర్టీసీ బస్సు లోపల చూశారు. ఆ తర్వాత పరిసరాల్లో గాలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. దీంతో స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.