ఆ యాప్స్‌తో ఇక కరెంట్‌ బిల్లు కట్టలేరు..! : ఆర్‌బిఐ ఆంక్షలు

న్యూఢిల్లీ : చెల్లింపుల యాప్‌ల ద్వారా ఇకపై కరెంట్‌ బిల్లులను చెల్లించడానికి వీలుండదు. ఇప్పటికే క్రెడిట్‌ కార్డుల ద్వారా ప్రభుత్వ బిల్లు చెల్లింపులు కుదరవని చెప్పిన రిజర్వు బ్యాంక్‌, తాజాగా గూగుల్‌ పే, పోన్‌ పే, పేటియం తదితర యాప్స్‌ ద్వారా కూడా బిల్లులను అంగీకరించబోమని పేర్కొంది.


కరెంటు బిల్లుల్ని తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా గాని, ఆయా కార్యాలయాలకు వెళ్లి గాని చెల్లించాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.