దుబాయ్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక కొత్త అట్రాక్షన్. తనకు తాను నిత్య నూతనంగా మార్చుకుంటూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఈ దేశం. ఇప్పటివరకు టూరిజంలో ది బెస్ట్ కంట్రీ అనిపించుకున్న దుబాయ్.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలోకి అడుగు పెట్టింది. అది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిశోధన. ఇన్నాళ్లు ప్రపంచానికి పెట్రోల్ బంక్‌గా ఉన్న దేశం ఇకపై సబ్ స్టేషన్‌గా మారనుంది.
గల్ఫ్ కంట్రీస్ అంటేనే ప్రపంచానికి ఇంధనం అందించే దేశాలుగా తెలుసు. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ప్రపంచ దేశాలకు మెజారిటీ సప్లై ఇక్కడి నుంచి అవుతుంది. క్రూడ్ ఆయిల్ సరఫరా ద్వారా భారీ ఎత్తున సంపాధనను గడించుకున్న ఈ దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా ఆయిల్ ధరలు పడిపోవడంతో ఆదాయం కోల్పోతున్నాయి. ఇది ముందే గ్రహించిన దుబాయ్ టూరిజం వైపు అడుగులు వేసి సక్సెస్ అయింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వ్యాపారంలో ఎలాంటి ఆదాయం లేకపోయినా.. టూరిజం ద్వారా భారీ ఎత్తున ఆర్జిస్తుంది దుబాయ్. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై మక్కువ చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి కూడా ఇది ఒక కారణం. ఒక అంచనా ప్రకారం మరో 15 సంవత్సరాలలో 50 శాతానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చేరుకుంటుంది. ఇన్నాళ్లు కార్లకు పెట్రోల్ డీజిల్ అమ్ముకొని బాగా సంపాదించిన దుబాయ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు కరెంటు సరఫరా చేసి మళ్లీ పాత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎవరూ చేయలేని కొత్త ఆలోచన చేసింది. చంద్రుడు నుంచి భారీ ఎత్తున సోలార్ పవర్‌ను భూమ్మీదికి తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రాజెక్టును మొదటి దశలో ముందుకు తీసుకెళుతుంది.