ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..

కుంభమేళ ప్రస్తుతం దేశంలోనే ఆధ్యాత్మిక హిందు పండుగగా మారింది. కుంభమేళలో పవిత్రమైన స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు బారీగా తరలిస్తున్నారు.


ముఖ్యంగా ఇది144 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న భారీ కుంభమేళ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కుంభమేళలో షాహి స్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకొవచ్చు.

ఇప్పటికే ఈ కుంభమేళలో.. పుష్య పౌర్ణమి వేళ మొదటి షాహి స్నానం ముగిసింది. ఆ తర్వాత సంక్రాంతి రోజు, పుష్య అమావాస్య, వసంత పంచమి, మహా శివరాత్రి పర్వదినాల్లో పవిత్రమైన స్నానాలు ఆచరిస్తారు. అయితే.. ఈ కుంభమేళకు దేశంలో ఉన్న.. 13 అఖాడాలకు చెందిన సాధులు, సంత్ లు, అఘోరీలు భారీగా తరలివస్తున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక అఘోరీ ఒంటి నిండా విష సర్పాలతో హల్ చల్ చేస్తున్నాడు.

అఘోరీ ఎక్కడి నుంచి వచ్చాడో.. కానీ ఆయన తలపై ఒంటి నిండా అనేక విషసర్పాలు ఉన్నాయి. అంతే కాకుండా.. ఆయన మాత్రం అవి ఒంటిపై పాకుతున్న అవేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అఘోరీ మీద విషసర్పాలను చూసి అక్కడున్న వారంత దూరంగా జరిగిపోతున్నారు. అయితే.. సదరు అఘోరీలు విషసర్పాలు, భూత ప్రేతాల మీద కూడా పైచేయి సాధించాలరని చెప్తుంటారు.

ఈ క్రమంలో కుంభమేళలో విచిత్రమైన అఘోరీలు, సాధు మహారాజ్ లు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఒండి నిండా విషసర్పాలతో ఉన్న ఈ అఘోరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. పాములు కాటేస్తే అతని పరిస్థితి ఏంటని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.