బడ్జెట్ ధరలో టెక్నో నుంచి AI స్మార్ట్ ఫోన్! ఫీచర్లు అదిరిపోయాయి

www.mannamweb.com


బడ్జెట్ వినియోగదారుల కోసం మార్కెట్లో ఎన్నో రకాల కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగా కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను టెక్నో కంపెనీ లాంచ్ చేసింది. దీని పేరు పోవా 6 నియో 5జి. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల బడ్జెట్ లో AI ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెక్నో ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ ఇంకా అలాగే 8GB వర్చువల్ ర్యామ్ తో వస్తుంది.

ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 108MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. మంచి సేల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో వుంది. ఇక ఈ ఫోన్లో AIGC పోర్ట్రైట్, AI మ్యాజిక్ ఎరేజర్, AI వాల్ పేపర్ ఇంకా అలాగే Ask AI వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ని కలిగి వుంది. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ ఉంటుంది. పోవా 6 నియో ఫోన్ IP 54 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది.

టెక్నో పోవా 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 13,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల వరకు తగ్గింపు అందుకునే ఆఫర్ ని కూడా టెక్నో కంపెనీ ఇచ్చింది. అలాగే ఈ స్మార్ట్ పై రూ. 1,000 లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 6GB + 128GB ధర వచ్చేసి రూ. 13,999 ఉంటుంది. ఇక 8GB + 256GB ధర అయితే రూ. 14,999 ఉంటుంది. 15వేల రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్ కావాలనుకునేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్. ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతాయి.