ముఖం చూపిస్తే డబ్బులు ఇచ్చే ఏటీఎం… అది మన ఏపీలో ఉంది.

దేశంలోనే అత్యధిక లాభార్జన కలిగిన, రాష్ట్రంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అవతరిస్తోంది. దాదాపు నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఏర్పడిన ఈ ప్రాంతీయ బ్యాంకులో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యుల కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు.


దేశంలోనే అత్యధిక లాభార్జన కలిగిన, రాష్ట్రంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అవతరిస్తోంది. దాదాపు నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఏర్పడిన ఈ ప్రాంతీయ బ్యాంకులో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యుల కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. పాస్‌బుక్, ఏటీఎం, యూపీఐతో పనిలేకుండా ఖాతాదారుని మొహాన్ని స్కాన్ చేసి, నగదు విత్ డ్రా చేసుకునే మెషిన్‌ను ఏర్పాటు చేశారు. దీనంతటి వెనుక బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్ కుమార్ రెడ్డి కృషి ఉంది.

నిన్నటి దాకా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు సేవలు అందించేవి. వాటన్నింటినీ విలీనం చేయడం ద్వారా బ్యాంకుల సామర్ధ్యాన్ని పెంచవచ్చు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందివచ్చు. అందుకోసమే విలీనం చేశాం. ఈ బ్యాంకుల విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. బ్యాంకు ప్రధానకార్యాలయం గుంటూరులోనే ఏర్పాటు చేశాం.

నాలుగు బ్యాంకుల విలీనం తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు నెట్‌వర్క్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అవతరించింది. రాష్ట్ర జనాభా 5.2 కోట్లు కాగా, అందులో 23 శాతం మంది మా బ్యాంకులోనే ఖాతా కలిగి ఉన్నారు. రాష్ట్రంలో 127 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. ప్రస్తుతం 1,351 బ్రాంచులతో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా రాష్ట్రంలో మూడో అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 167 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకింగ్ కరస్పాండెన్స్ విధానం ద్వారా 3,029 పాయింట్లలో ఖాతాదారులకు సేవల అందజేస్తున్నాం.

బ్యాంకులో అందుబాటులోకి తెచ్చిన సాంకేతికత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కమర్షియల్ బ్యాంకులు కూడా అందుబాటులోకి తీసుకురాని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందుబాటులోకి తెస్తున్నాం. బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం, ఆధార్, యూపీఐ యాప్ వేటితో సంబంధం లేకుండా ఖాతాదారుడు తనకు కావాల్సిన నగదును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్, ఏటీఎం, యూపీఐ వినియోగంపై అంత అవగాహన ఉండదు. పైగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ అంటే ప్రజల్లో భయం ఉంటుంది. పోనీ బ్యాంకుకు వెళదామా అంటే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. అందుకని ఖాతాదారు బ్యాంకు అంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఒట్టి చేతులతో వెళ్లి నగదు విత్ డ్రా చేసుకునేలా ‘ఫేస్ పే’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం.

అన్ని బ్యాంకులు ఏటీఎం, యూపీఐ వంటి సేవలు అందిస్తున్నాయి. వాటితో పాటు మనం ఫేస్ పే సదుపాయాన్ని తెచ్చాం. బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకోవాలనుకునేవారు విత్ డ్రా ఫామ్ నింపడం, క్యూలో నిలబడటం వంటి సమస్యలను ఫేస్ పేలేకుండా చేస్తుంది. ఖాతాదారు ఫేస్ పే మిషన్ ఎదురుగా నించుంటే అది అతడి ముఖాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఫొటో తీసుకుని సరిపోల్చుకుంటుంది. ఓకే అయిన తర్వాత ఖాతాదారు పేరు, పాస్‌బుక్ వివరాలు, ఖాతాలో నిల్వ మొత్తం తెలుగులో ఖాతాదారుకు వినిపిస్తుంది. విత్ డ్రా సేవను చెబుతుంది. ఖాతాదారు తాను విత్ డ్రా చేసుకోదల్చిన మొత్తాన్ని నమోదు చేశాక, దాన్ని కన్ఫార్మ్ చేసుకోవడానికి మరోసారి వినిపిస్తుంది. ఖాతాదారు ఓకే చేస్తే ఏటీఎంలో లాగా నగదు బయటకు వస్తుంది. నగదు లేకపోతే ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ తీసుకుని బ్యాంకు సిబ్బందికి ఇస్తే వారు వెంటనే డబ్బు ఇస్తారు.

 ప్రస్తుతం రూ.25 వేల వరకూ ఫేస్ పే ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. మున్ముందు మరింత పెంచుతాం. దాంతోపాటు నగదు డిపాజిట్, ఇతర సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకువస్తాం.

అలా జరిగే అవకాశమే లేదు. ఫొటోలు పెడితే మిషన్ తీసుకోదు. అలాంటి మోసాలు జరగకుండా ఉండడానికి ‘లైవ్‌నెస్ డిటెక్షన్‌ను అమర్చాం. సజీవమైన మనిషి ఉంటేనే మిషన్ తీసుకుంటుంది.

అన్ని చోట్లకు వీటిని అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా పదిచోట్ల ఏర్పాటు చేశాం. గుంటూరు జిల్లాలో బ్రాడీపేట, మంగళగిరి, నంబూరు, యనమదలలో, పల్నాడు జిల్లాలో నరసరావుపేట, మోర్జంపాడు, కారంపూడి, పులిపాడు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాం. గుంటూరు బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన ఫేస్ పే మిషన్‌ను నాబార్డ్ సీజీఎం ఎం.ఆర్. గోపాలం ప్రారంభించారు.