ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. NH 167-A విస్తరణ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనుంది.
ఇందుకోసం 1,064.24 కోట్ల వ్యయం అవుతుందని ప్రాధమికంగా అధికారులు అంచనా వేశారు. మొత్తం 85 కిలోమీటర్లను నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. దీంతో చీరాల వైపు వెళ్లేవారికి సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణం సులువుగా మారడమే కాకుండా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు…
నెకరికల్లు వద్ద అదంకి-నార్కెట్‌పల్లి రోడ్, చీరాల వద్ద NH 216, చిలకలూరిపేట వద్ద NH 16కి అనుసంధానం చేస్తూ ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. 18 కిలోమీటర్ల మేరకు కొత్త రోడ్డు వాడరేవు నుండి ఈపురిపాలెం వరకు.బైపాస్ రోడ్లు నిర్మాణం జరుగుతంది. పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట వద్ద బైపాస్‌లు ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల చీరాల నుండి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. .
టూరిజం కూడా…
బాపట్ల-వాడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కోస్తా తీర ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఏర్పడుతుందని భావిస్తున్నారు. రహదారులు బాగా ఉండి, సులువుగా ప్రయాణం చేసే వీలుంటే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. పల్నాడులో 277.79 హెక్టార్లు, బాపట్లలో 103 హెక్టార్లు, మౌలిక వసతల కల్పన, ట్రాఫిక్ ను తగ్గించడానికి మరియు కనెక్టివిటీ మెరుగుపర్చడానికి బైపాస్‌లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిల ప్రణాళిక ను సిద్ధం చేశారు. సో కోస్తా తీర ప్రాంతవాసులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.