Andhra Pradesh Assembly Elections: పోలింగ్‌లో రికార్డులు బద్దలు

www.mannamweb.com


పోస్టల్‌ బ్యాలట్‌, హోమ్‌ ఓటింగ్‌ కలిపితే 81.86 శాతం
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇదే అత్యధికం
2014తో పోలిస్తే మొత్తంగా 3.45%, 2019 కంటే 2.09% ఎక్కువ
వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు, అమరావతి: ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్‌ బ్యాలట్‌తో కలిపి ) పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్‌ జరగలేదు. ఇది దేశంలోనే రికార్డు. మన రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలట్‌తో కలిపి 2014 ఎన్నికల్లో 78.41%, 2019లో 79.77% పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో 2014తో పోలిస్తే 3.45%, 2019తో పోలిస్తే 2.09% మేర ఓటింగ్‌ పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కంటే ఈసారి 26 లక్షల మంది ఓటర్లు అదనంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, విశాఖపట్నంలో 71.11% పోలింగ్‌ నమోదైంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఈ వివరాలు వెల్లడించారు.

  • ఈవీఎంలలో నమోదైన ఓట్లు, పోస్టల్‌ బ్యాలట్‌, హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఓటేసిన వారి ఓట్లు కలిపితే మొత్తం పోలింగ్‌ శాతం: 81.86
  • శాసనసభ నియోజకవర్గాల కంటే లోక్‌సభ నియోజకవర్గాలకు అదనంగా 227 మంది ఓటర్లు ఓటేశారు.
  • శాసనసభ నియోజకవర్గాలకు ఓట్లేసిన వారి సంఖ్య: 3,33,40,333
  • లోక్‌సభ నియోజకవర్గాలకు ఓట్లేసిన వారి సంఖ్య:  3,33,40,560
  • 2019లో పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,62,379 మంది ఓట్లేశారు. 56,000 పోస్టల్‌ బ్యాలట్లు అప్పట్లో తిరస్కరణకు గురయ్యాయి.

నియోజకవర్గాల వారీగా 2014, 2019, 2024 ఎన్నికల్లో పోలింగ్‌శాతం (పోస్టల్‌ బ్యాలట్‌ కాకుండా)