AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఏపీఎస్ ఆర్టీసీలో (APSRTC) వేలాది మంది ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్‌ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.


ఆర్టీసీలో 1/2019 సర్క్యూలర్‌ను నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. 1/2019 సర్క్యూలర్‌ అమలు కోసం ఇటీవల ఎన్ఎంయూఏ నేతల (NMU Leaders) నేతృత్వంలో ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ (AP Government) ఆదేశం మేరకు ఎన్ఎంయూఏ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపింది. ఉద్యోగులపై చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు సరికాదంటూ యాజమాన్యం దృష్టికి నేతలు తీసుకువచ్చారు.

1/2019 సర్క్యూలర్‌కు మాత్రమే కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు 1/2019 సర్క్యూలర్‌లోని అంశాలు పాటించాలని ఆర్టీసీ ఆదేశించింది. ఆర్టీసీలో 1/2019 సర్క్యూలర్‌ అమలుపై ఆదేశాలివ్వడంపై ఎన్‌ఎంయూఏ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీకి ఎన్ఎంయూఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. రేపు అన్ని బస్ డిపోల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఎన్‌ఎంయూఏ. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించేలా ఇచ్చిన ఆదేశాలపై కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలపాలని ఎన్‌ఎంయూఏ నిర్ణయం తీసుకుంది.